Supreme Court: ముఖ్య‌మంత్రివి.. ఒళ్లు ద‌గ్గ‌ర‌పెట్టుకుని మాట్లాడు

supreme court slams revanth reddy for his remarks on kavitha bail

Supreme Court: సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు బీఆర్ గవాయ్, కేవీ విశ్వ‌నాథ‌న్‌లు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. ఢిల్లీ లిక్క‌ర్ కేసులో భార‌త రాష్ట్ర స‌మితి క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు బెయిల్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఆమెకు బెయిల్ మంజూరు చేసింది ఆ ఇద్ద‌రు న్యాయ‌మూర్తులే. అయితే క‌విత‌కు బెయిల్ రాగానే రేవంత్ వివాదాస్ప‌ద కామెంట్స్ చేసారు. ఇదే కేసులో 11 నెల‌ల పాటు ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోదియా ఉన్నార‌ని.. ముఖ్యమంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌కు ఇంకా బెయిల్ కూడా రాలేద‌ని.. అలాంటిది క‌విత‌కు ఇంత త్వ‌ర‌గా బెయిల్ వ‌చ్చిందంటే క‌చ్చితంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్రోద్భ‌లంతోనే వ‌చ్చింద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

ఈ విష‌యం కాస్తా సుప్రీంకోర్టు దాకా వెళ్ల‌డంతో గ‌వాయ్, విశ్వ‌నాథ‌న్‌లు రేవంత్‌పై మండిప‌డ్డారు. “” మీరేం మాట్లాడుతున్నారో చూసుకోండి. ఓ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి మీరు. ఇలాగేనా మాట్లాడేది? అంటే మేం ఏ తీర్పు ఇవ్వాలో కూడా ఓ రాజ‌కీయ పార్టీని అడిగి ఇవ్వాలా? ఎవ‌డు ఎన్ని కామెంట్స్ చేసినా మాకు ఒరిగేది ఏమీ లేదు. మా విజ్ఞ‌త‌ను బ‌ట్టి తీర్పును ఇస్తుంటాం “” అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.