AP Elections: స్వ‌రం మార్చిన ప‌వ‌న్.. పొత్తు ధ‌ర్మం ఇదేనా?

AP Elections: తెలుగు దేశం పార్టీ (TDP) జ‌న‌సేన (janasena) పొత్తులో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. జ‌నసేన పార్టీ రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. పొత్తు ధ‌ర్మం ప్ర‌కారం తెలుగు దేశం పార్టీ సీట్లు ప్ర‌క‌టించ‌కూడ‌దు. కానీ ప్ర‌క‌టించేసారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ (pawan kalyan) కూడా రాజోలు, రాజాన‌గ‌రం నుంచి జ‌న‌సేన పోటీ చేయ‌న్న‌ట్లు ప్ర‌క‌టించారు. చంద్ర‌బాబు నాయుడుకు (chandrababu naidu) ఒత్తిడి ఉన్న‌ట్లే త‌న‌కు కూడా ఉందని ప‌వ‌న్ తెలిపారు. రాజాన‌గ‌రం రేసులో బ‌త్తుల రామ‌కృష్ణ‌, రాజోలు రేసులో బొంతు రాజేశ్వ‌ర‌రావు, వ‌ర‌ప్ర‌సాద్, డీఎంఆర్ శేఖ‌ర్ బ‌రిలో నిల‌వ‌నున్నారు.

ఈ స‌మ‌యంలో తెలుగు దేశం పార్టీ కానీ జ‌న‌సేన కానీ ఎక్క‌డెక్క‌డ పోటీ చేయ‌నున్నారో ముందే ప్ర‌క‌టించేస్తే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అప్ర‌మ‌త్త‌మై త‌న పావులు క‌దుపుతాడ‌ని.. చెల్లిని వ‌ద‌ల‌ని జ‌గ‌న్ త‌మ‌ను వ‌దిలిపెడ‌తార‌ని ఎలా అనుకున్నార‌ని ప‌వ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. పొత్త ధ‌ర్మంలో భాగంగా ముందే సీట్ల వివ‌రాల‌ను ప్ర‌క‌టించ‌కూడ‌దు అని ప‌వ‌న్ చంద్ర‌బాబుతో చెప్పారు. కానీ చంద్ర‌బాబు విన‌కుండా ప్ర‌క‌టించేస్తున్నారు. దాంతో ప‌వన్ కూడా నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప్ర‌క‌టించాల్సి వ‌చ్చింది.