ప్రచారానికి డబ్బుల్లేక పార్టీ టికెట్ వెనక్కిచ్చేసిన నేత
Sucharita Mohanty: ప్రచారానికి డబ్బుల్లేక ఓ మహిళా నేత తన ఎమ్మెల్యే టికెట్‌ను వెనక్కి ఇచ్చేసింది. ఈ ఘటన ఒడిశాలోని పూరి ప్రాంతంలో చోటుచేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పూరి నుంచి సుచరిత మొహంతే అనే నేతను బరిలోకి దింపింది. అయితే ప్రచారం చేసేందుకు పార్టీ నుంచి ఎలాంటి ఫండ్స్ రాలేదట. ఉన్నదానితో సరిపెట్టుకుందామన్నా కష్టంగా ఉందని ఆమె తన టికెట్‌ను వెనక్కి ఇచ్చేసారు. ఇందులో కాంగ్రెస్ తప్పు ఏమీ లేదని.. భారతీయ జనతా పార్టీ వల్లే కాంగ్రెస్ పార్టీతో పాటు దేశ ప్రజలు కూడా అల్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు.