Tomato: ధరలు పెరిగితే తినడం మానేయండి
Uttar Pradesh: కూరగాయలు, పండ్లు ఇలా ఏ వస్తువు ధర పెరిగినా వాటిని కొనడమే మానేస్తే ఆటోమేటిక్‌గా ధరలు తగ్గి వస్తాయని విచిత్రమైన కామెంట్స్ చేసారు ఉత్తర్‌ప్రదేశ్ మంత్రి ప్రతిభా శుక్లా (prathibha shukla). టొమాటోల (tomato) ధర ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో ఆమె ఈ విధంగా అన్నారు. టొమాటోల ధరలు పెరగడం ఇదేం మొదటిసారి కాదని, ప్రతి సమస్యకు పరిష్కారం మన చేతుల్లోనే ఉంటుందని అన్నారు. ” టొమాటోల ధరలు పెరిగాయ్. కానీ ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా సార్లు వాటి ధరలు పెరిగాయ్. అలాంటప్పుడు వాటని కొనుక్కుని తినడం మానేయండి. అలా చేస్తే ధరలు వాటంతట అవే దిగి వస్తాయి. కావాలంటే ఇంట్లోనే టొమాటోల చెట్లు వేసుకోండి. టొమాటోలకి బదులు నిమ్మకాయలు వాడుకోండి ” అని ఆమె చేసిన కామెంట్స్ చర్చకు దారితీసాయి. ఆమె కామెంట్స్‌పై కాంగ్రెస్ (congress) స్పందిస్తూ.. టొమాటోల ధరలు తగ్గించే మార్గం కేంద్రానికి లేదని మంత్రిగారి కామెంట్స్‌తో క్లియర్‌గా తెలుస్తోంది అంటూ మండిపడింది.