YS Jagan: జగన్‌పై రాళ్ల దాడి.. తీవ్రంగా గాయపడిన సీఎం
YS Jagan: ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆగంతకులు రాళ్ల దాడికి పాల్పడ్డాడు. విజయవాడలో జగన్ బస్సు యాత్ర చేపడుతుండగా జగన్‌పై రాళ్లు విసిరారు. దాంతో ఆయన తల, చేతి భాగానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ప్రథమ చికిత్స చేసి ఆయన్ను జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించారు. జగన్ పక్కనే వెల్లంపల్లి కూడా ఉన్నారు. ఆయనకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. జగన్‌పై దాడితో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.