MLA Ticket ఇవ్వ‌లేదని..!

తెలంగాణ సీఎం KCR నిన్న ప్ర‌క‌టించిన అభ్య‌ర్థుల (mla ticket) లిస్ట్‌లో త‌న పేరు లేదని BRS స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య బోర‌న ఏడ్చారు. రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న‌కు పోటీ చేసే అవ‌కాశం ఇవ్వకపోవడంతో అంబేడ్కర్ విగ్రహం ముందు పడుకొని ఏడ్చారు. నిన్న ప్రెస్ మీట్‌లో KCR క్లియ‌ర్‌గా ఒక విష‌యం చెప్పారు. టికెట్ రాని వారు చిన్నబుచ్చుకోవ‌ద్ద‌ని.. ఈ ఎన్నిక‌ల్లో కాక‌పోతే ఎమ్మెల్సీ, ఎంపీ, మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో అవ‌కాశాలు వ‌స్తాయ‌ని అన్నారు. అయినా కూడా కొంద‌రు నేత‌లు ఇలా మీడియా ముందు చిల్ల‌ర ప‌నులు చేస్తూ త‌మ ప‌రువు తామే తీసుకుంటున్నారు. (telangana elections)