Stalin: మోదీపై అమిత్ షా కోపంగా ఉన్నారా?

Chennai: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై (mopdi) కేంద్ర‌మంత్రి అమిత్ షా (amit shah) కోపంగా ఉన్నారా? అని ప్ర‌శ్నించారు త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ (stalin). ఎందుకంటే నిన్న అమిత్ షా.. సౌత్ చెన్నైలోని జిల్లా పార్టీ అధినేత‌ల‌తో అమిత్ షా స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క త‌మిళ వ్య‌క్తి కూడా ప్ర‌ధాని కాక‌పోవ‌డం బాధాక‌రం.. ఆ ఛాన్స్ అస‌లు ఇవ్వ‌లేదు అని అన్నారు. దీనిపై స్టాలిన్ స్పందించారు.

“అదేంటో అమిత్ షా అలా అన్నారు. ఇప్పుడున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ. అంటే మోదీపై అమిత్ షా కోపంగా ఉన్నారా? ఒక‌వేళ అమిత్ షా అన్న‌ట్లు త‌మిళ‌నాడు నుంచి ఎవ‌రైనా ప్ర‌ధాని అవుతారంటే అది త‌మిళిసై లేదా ఎల్ మురుగ‌న్‌ల‌కు అర్హ‌త ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు త‌మిళ‌నాడుకు కేంద్రం ఏం ప్రాజెక్టులు, ఫండ్స్ కేటాయించింది అని షాని అడిగాను. దానికి ఆయ‌న స‌మాధానం చెప్ప‌కుండా త‌మిళ వ్య‌క్తి ప్ర‌ధాని అవ్వ‌లేదు అని ఏవేవో చెప్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన దానికంటే నాలుగింత‌లు ఎక్కువే ఇచ్చాం అన్నారు. పైగా త‌మిళ‌నాడులో ఎయిమ్స్‌ని తీసుకొచ్చింది డీఎంకే కాంగ్రెస్ కానేకాదు అని అన్నారు. వాళ్లు ఎయిమ్స్‌ని ఇక్క‌డికి తీసుకొచ్చిన స‌మ‌యంలో అస‌లు రాష్ట్రానికి ఎయిమ్స్ అవ‌స‌రం కూడా లేదు” అని మండిప‌డ్డారు స్టాలిన్.