Women’s Reservation Bill: OBCలకు కూడా అవకాశం ఇవ్వాలి
ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై (women’s reservation bill) ఈరోజు పార్లమెంట్‌లో సమావేశాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (sonia gandhi) మాట్లాడుతూ.. SC, STలకే కాకుండా OBCలకు కూడా అవకాశం కల్పించాలని డిమాండ్ చేసారు. తన భర్త, దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మొదటిసారి తన హయాంలో ఈ బిల్లును ప్రవేశపెట్టారని.. ఇప్పుడు దీని గురించి మాట్లాడుతుంటే భావోద్వేగానికి గురవుతున్నానని సోనియా అన్నారు.