Sonia Gandhi: మీడియా ముందుకు వెళ్లొద్దంటూ కూట‌మికి స‌ల‌హా

కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ (sonia gandhi) ఇండియా కూట‌మిలో (india bloc) ఉన్న పార్టీల‌కు ఓ స‌ల‌హా ఇచ్చారు. ఎవ్వ‌రూ కూడా మీడియా ముందుకు వెళ్ల‌డాలు ప్రెస్ మీట్లు పెట్ట‌డాలు వంటివి చేయొద్ద‌ని పిలుపునిచ్చారు. రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో (lok sabha elections) గెల‌వ‌డానికి కూట‌మిలో ఐక‌మ‌త్యం అవ‌స‌రమ‌ని.. మ‌న‌లో మ‌నం కొట్టుకుంటే ఏం లాభ‌మ‌ని మంద‌లించారు. మీడియా ముందుకు వెళ్ల‌కుండా ఉంటే వారు ప్ర‌శ్న‌లు అడ‌గ‌డం మానేస్తారు కాబ‌ట్టి లేని పోని స‌మాధానాలు ఇచ్చి BJPకి చిక్క‌వ‌ద్ద‌ని స‌ల‌హా ఇచ్చారు.