Somu Veerraju: చంద్రబాబు మావాళ్లని కలిస్తే తప్పేంటి?
Hyderabad: BJP జాతీయ పార్టీ అని సీనియర్ నేత సోము వీర్రాజు (somu veerraju) అన్నారు. ఇటీవల TDP అధినేత చంద్రబాబు..కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డాలను కలిసిన సంగతి తెలిసిందే. దీనిపై పలు పార్టీలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుంటే సోము వీర్రాజు స్పందించారు. TDP BJP నేతలను కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. BJP జాతీయ పార్టీ అని అలాంటప్పుడు ఎవరు ఎవరినైనా కలవచ్చని అన్నారు. చంద్రబాబు అమిత్ షాను కలిసినంత మాత్రాన దాని గురించి పెద్దగా చర్చించుకోవాల్సిన పనిలేదని తెలిపారు.