సూర్య గ్ర‌హ‌ణ ప్ర‌భావం: చంద్ర‌బాబుకు అశుభం.. జ‌గ‌న్‌కు రాజ‌యోగం!

Solar Eclipse: ఏప్రిల్ 8న కేతుగ్ర‌స్త సూర్య‌గ్ర‌హ‌ణం ఏర్ప‌డ‌బోతోంది. రాత్రి 9:21 నుంచి అర్థ‌రాత్రి 2:15 వ‌ర‌కు ఈ గ్ర‌హ‌ణం ఉండ‌బోతోంది. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు రాబోతున్న నేప‌థ్యంలో ప్ర‌చారంలో బిజీ బిజీగా ఉన్న అగ్ర నేత‌లు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు (Chandrababu Naidu), వైఎస్సార్ కాంగ్రెస్ నేత జ‌గన్ మోహ‌న్ రెడ్డిలకు (Jagan Mohan Reddy) ఎలాంటి ప్ర‌భావం ఉండ‌బోతోందో వెల్ల‌డించారు ప్ర‌ముఖ జ్యోతిష్య నిపుణుడు ప్ర‌దీప్ జోషి.

చంద్ర‌బాబు నాయుడుది ధ‌నుస్సు రాశి అని.. ఈ రాశి వారికి గ్ర‌హణం అస్స‌లు మంచిది కాద‌ని అన్నారు. దాదాపు నెల రోజుల పాటు ఈ గ్ర‌హ‌ణ ప్ర‌భావం ఉంటుంద‌ని తెలిపారు. తాను ఆల్రెడీ చంద్ర‌బాబు నాయుడుని క‌లిసి అరిష్ట నివార‌ణ తంత్రం జ‌రిపించుకోవాల‌ని సూచించాన‌ని పేర్కొన్నారు. గ్ర‌హ‌ణం లోప‌లే ఈ ప‌రిహారం చేసుకోవాల‌ని సూచించాన‌ని వెల్ల‌డించారు. ఇక‌ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురించి చెప్తూ ఆయ‌న‌ది మిథున రాశి అని.. సూర్య గ్ర‌హ‌ణం త‌ర్వాత ఆయ‌న‌కు క‌లిసొచ్చే అవ‌కాశం మ‌రింత ఎక్కువ‌గా ఉంద‌ని తెలిపారు.

ALSO READ: Solar Eclipse: ఏ రాశుల వారికి మంచిది? ఎవ‌రికి అశుభం?