Smriti Irani: “నెలసరి సెలవులు అవసరం లేదు.. అదేమీ వైకల్యం కాదు”
Smriti Irani: చాలా కంపెనీల్లో మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు ఇస్తుంటారు. ఇవి పెయిడ్ లీవ్స్గానే వర్తిస్తాయి. అయితే అసలు మహిళలకు నెలసరి సెలవులు అవసరం లేదని అంటున్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. నెలసరి అనేది అంగవైకల్యం కాదని ప్రతి ఆడపిల్లకు ప్రకృతి పరంగా సహజంగా జరిగే చర్య అని తెలిపారు. దీనిని ఒక అంగవైకల్యంగా చూసి సెలవులు ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాజ్యసభలో ఎంపీ మనోజ్ కుమార్ ఝాతో మాట్లాడుతూ స్మృతి ఈ టాపిక్‌ను హైలైట్ చేసారు. ఆడవారికి నెలసరి సెలవులు ఇవ్వడం వల్ల వారికి దక్కాల్సిన సమాన అవకాశాలు దక్కకుండాపోతున్నాయని పేర్కొన్నారు.