Smita Sabharwal: ఎదిగితే మీదపడిపోతారు.. కొండా సురేఖకు స్మిత సబర్వాల్ చురక
Smita Sabharwal: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై ప్రముఖ IAS అధికారిణి స్మిత సబర్వాల్ కూడా మండిపడ్డారు. రాజకీయాల్లో ప్రత్యర్థులపై కామెంట్స్ చేసేందుకు ఆమె సమంత, నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్‌ల పేర్లు వాడుకోవడంపై సినీ పరిశ్రమ రచ్చ చేస్తోంది. ఇప్పటికే నాగార్జున తన కుమారుడి పేరు బద్నాం చేసింది అంటూ పోలీస్ స్టేషన్‌లో కొండా సురేఖపై కేసు పెట్టారు. తాజాగా స్మిత సబర్వాల్ కొండా సురేఖపై మండిపడ్డారు.
“” ఆడవాళ్లను సెన్సేషనల్ అయ్యేందుకు, నలుగురి దృష్టి పడేందుకు థంబ్ నెయిల్స్‌గా వాడుకుంటారు. అధికారులను కూడా వదలరు. నేను నా వ్యక్తిగత అనుభవం నుంచి చెప్తున్నాను. ఎంతో కష్టపడి ఎత్తుకు ఎదిగితే అంత గట్టిగా నిందలు వేసేందుకు ఎగబడుతుంటారు. మహిళలను, కుటుంబాలను గౌరవించి సమాజంలో మంచి నిబంధనలు తీసుకొద్దాం. సిట్టింగ్ మంత్రిగా ఉండి మరో మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. ప్రతీ విషయాన్ని రాజకీయం చేయకూడదు. పబ్లిక్ జీవితాల్లో ఒక ఆరోగ్యకరమై వాతావరణాన్ని నెలకొల్పుదాం “” అని ట్వీట్ చేసారు.