Singireddy: గజ్జెలు కట్టుకుని తిరుగుతా రేవంత్‌ని ఓడిస్తా
రేవంత్ రెడ్డిని (revanth reddy) నమ్ముకొని మోసపోయానని ఆయన BRS అభ్యర్థిని గెలిపించాలని చూస్తున్నాడని తీవ్ర ఆరోపణలు చేసారు ఏ ఎస్ రావు నగర్ కార్పొరేటర్ శిరీష భర్త సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి (singireddy). “” రేవంత్ వల్ల నష్టపోయిన నాలాంటి బాధితులను కలుపుకుని కొడంగల్లో ఆయన్ని ఓడగొట్టిస్తా. ఉప్పల్‌లో నాకు టికెట్ ఇస్తే నేను గెలుస్తాను అని సర్వేలన్నీ చెప్పాయి. GHMC ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది రెండు సీట్లయితే.. నా భార్య కార్పొరేటర్‌గా గెలిచింది. గత తోమిదేళ్ల నుంచి పార్టీ కోసం పని చేశా. పార్టీ సచ్చిపోతుంది అనుకున్నప్పుడు పార్టీలో ఎవరు లేరు. నేను రేవంత్ రెడ్డికి సన్నిహితుడిని. ఎన్ని కష్టాలు ఎదురైనా పార్టీతోనే ఉన్నా. 2014లో టికెట్ అన్నారు.. ఆ తరువాత 2018లో అన్నారు.. ఇప్పుడు కూడా ఇవ్వలేదు.
కనీసం సెకండ్ ఆప్షన్‌గా కూడా నా పేరు స్క్రీనింగ్ కమిటీలో పెట్టలేదు. పరమేశ్వర్ రెడ్డిని గెలిపించాలని రేవంత్ రెడ్డికి లేదు. BRS అభ్యర్థిని గెలిపించాలని చూస్తున్నాడు. పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్స్ ఇచ్చి.. పార్టీని నాశనం చేయాలని రేవంత్ చూస్తున్నాడు. టీడీపీ లాగా పార్టీని నాశనం చేసి ప్రాంతీయ పార్టీ స్థాపించాలని రేవంత్ ప్లాన్లు వేస్తున్నాడు. సీఎం పదవి కోసం ప్రైవేట్ ఆర్మీని రేవంత్ నిర్మించుకున్నాడు. రేవంత్ రెడ్డికి అధికారం కట్టబెడితే రాష్ట్రాన్ని అమ్మేస్తాడు. రేవంత్ రెడ్డిని కొడంగల్లో తంతే మల్కాజిగిరిలో మేము గెలిపించుకున్నాం. (singireddy)
రేవంత్ రెడ్డికి అహంకారం వచ్చింది. ఆయన బాధితులు అంతా నాతో రండి. అందరి తరుపున నేను కొట్లాడ్తా. కొడంగల్లో రేవంత్ ఓటమికి నా వంతు ప్రయత్నం నేను చేస్తా. 300 మంది రేవంత్ బాధితులు ఉన్నారు. మాతో వందల కోట్లు ఖర్చు చేయించారు. ఇన్ని రోజులు రేవంత్ కోసం పని చేసిన నేను.. రేపటి నుంచి రేవంత్‌కు వ్యతిరేకంగా పని చేస్తా. రేవంత్ రెడ్డి కో హటావో.. కాంగ్రెస్ కో బచావో. అన్ని నియోజకవర్గాల్లో కాళ్లకు గజ్జెలు కట్టుకుని తిరుగుతా. రేవంత్‌ని ఓడగొడతా. నా నియోజకవర్గంకు పోవాలంటే సిగ్గుగా ఉంది. 15 రోజుల నుంచి ఢిల్లీలో దాకున్నా. కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులను పక్కన పెడితే BRSని ఎలా ఎదిరిస్తారు? ఉప్పల్లో పార్టీ ఖాళీ అవుతుంది. నాకు నా ప్రజల మంచి కోసం ఏ పార్టీ హామీ ఇస్తే ఆ పార్టీలో చేరుతా “” అని తెలిపారు సింగిరెడ్డి. (singireddy)