Politics: మీరేంటో.. మీ విధానాలేంటో…!
Politics: ఆంధ్రప్రదేశ్‌లో (andhra pradesh) TDP ప్రభుత్వం అధికారం కోల్పోయి జగన్ మోహన్ రెడ్డి (jagan mohan reddy) ముఖ్యమంత్రి అయ్యాక అబ్బా ఇక ఏపీని ఓ రేంజ్‌లో డెవలప్ చేసేస్తారు అనుకున్నారు పిచ్చి ప్రజలు. కానీ జగన్ సీఎం అవ్వగానే ఆయన చేసిన మొట్ట మొదటి పని TDP కట్టించినవన్నీ కూల్చేయడం. ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే మొదట ప్రజా వేదికను కూల్చేసారు.
ఇప్పుడు తెలంగాణలోనూ (telangana) అదే జరిగింది. BRS ప్రభుత్వం పోయి కాంగ్రెస్ (congress) అధికారం చేజిక్కించుకుని రేవంత్ రెడ్డిని (revanth reddy) ముఖ్యమంత్రిని చేసారు. తాను అందరిలా కాదు విమర్శలు చేస్తూ కూర్చోను ప్రజలకు మంచి చేయడం కోసమే పని చేస్తాను అని చెప్పిన రేవంత్ రెడ్డి కూడా జగన్ బాటలోనే నడుస్తున్నారు. అందుకే సీఎం అయ్యాక ఆయన కూడా జగన్ లాగా ప్రగతి భవన్ ముందు వేసిన రక్షణ కంచెను పీకించేసారు. నిజానికి ఈ రక్షణ కంచెను వేసింది BRS ప్రభుత్వం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వమే. వారు వేసింది వారే కూల్చేసుకునేంత కక్షతో ఉన్నారన్నమాట. (politics)
ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య పోలికలు ఇంకా చాలానే ఉన్నాయి. జగన్ అధికారంలోకి వచ్చాక CPS రద్దు చేస్తాం అన్నారు. కానీ చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే చేసారు. అధికారంలోకి వచ్చాక తొలి కేబినెట్ మీటింగ్‌లోనే DSC ప్రకటన చేస్తాం అన్నారు. ఇంకా చేయలేదు. అదేమని ప్రశ్నిస్తే ఇప్పుడే కదా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అప్పుడే అన్ని పనులు ఎలా జరిగిపోతాయ్ అంటున్నారు. జగన్ ఐటీ కంపెనీల గురించి ఉద్యోగాల గురించి మాట్లాడమంటే.. అభివృద్ధి అంటే పెద్ద పెద్ద బల్డింగులు కాదు అనేవారు. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కూడా ఇదే పాట పాడుతోంది. తెలంగాణకు ఎన్ని పెద్ద ఐటీ కంపెనీలు, పరిశ్రమలు వచ్చినా కూడా లాభాలు ఆ కంపెనీలకే పోతాయి కానీ తెలంగాణకు రావని చెప్తున్నారు.
జగన్ అధికారంలోకి వచ్చాక అవుటర్ రింగ్ రోడ్డు పనులు ఆపేసారు. అందులో నిర్మాణ ప్లానింగ్ లోపాలు ఉన్నాయన్నారు. ఇప్పుడు రేవంత్ కూడా మెట్రో విస్తరణకు నిలిపివేయించారు. ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వచ్చాక ఆరు నెలల సమయంలోనే ఎలా పనిచేస్తుందో తెలిసిపోతుంది. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అధికారంలోకి వచ్చిన గంటలోనే అది చేసేస్తాం ఇది చేసేస్తాం అని మాటిచ్చేసి ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. హామీల గురించి ప్రశ్నిస్తే BRS ప్రభుత్వం తెలంగాణను అప్పుల్లో ముంచేసింది అని సమాధానం ఇస్తున్నారు. ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ నేతలు దొరకుతారా ఎప్పుడెప్పుడు నిలదీద్దామా అని అటు BRS నేతలు కూడా ఎదురుచూస్తున్నారు. (politics)