Sidharth Luthra: చంద్రబాబు తరఫున వాదించబోయేది ఇతనే
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో భాగంగా అరెస్ట్ అయిన TDP అధినేత చంద్రబాబు (chandrababu) తరఫున వాదించబోయేది పై ఫోటో ఉన్న ఆయనే. ఈ న్యాయవాది పేరు సిద్ధార్థ్ లుత్రా (sidharth luthra). ఈయన సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఈయన దేశంలోనే టాప్ క్రిమినల్ లాయర్లలో ఒకరు. దాదాపు 30 ఏళ్లుగా ఈ ప్రొఫెషన్‌లో ఉన్నారు. 2015లో చంద్రబాబు నాయుడుపై ఓటు స్కాం కేసు పెట్టినప్పుడు కూడా ఆయన తరఫున లుత్రానే వాదించారు. నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో కూడా లుత్రా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించారు. (sidharth luthra)