Siddaramaiah: కన్నడ రాజ్య సీఎం సిద్దూనే..!
Bengaluru: మొత్తానికి కాంగ్రెస్ కర్ణాటక ముఖ్యమంత్రి(karnataka cm) బాధ్యతలను సిద్ధారామయ్యకే(siddaramaiah) అప్పగించింది. పార్టీ దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారట. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య(siddaramaiah) 20న ముఖ్యమంత్రిగా కంఠీరవ(kanteerava) స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ఆయనకు అధికారులు ప్రొటోకాల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇక డీకే శివకుమార్‌కు(dk shivakumar) డిప్యూటీ మినిస్టర్ బాధ్యతలు అప్పగించారు. అయితే… డిప్యూటీ పదవికి డీకే(dk) ఒప్పుకున్నారా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత లేదు. ఎందుకంటే.. శివకుమార్ సీఎం పదవి అయితేనే చేస్తానని లేదంటూ ఎమ్మెల్యేగానే కొనసాగుతానని పలుమార్లు మీడియా ద్వారా వెల్లడించారు. రాహుల్, మల్లికార్జున్ ఖర్గే డీకేతో బాగా చర్చించి డిప్యూటీ మినిస్టర్ పదవితో పాటు ప్రస్తుతం ఉన్న కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ పొజిషన్ కూడా ఇస్తామన్నారట. అంతేకాదు.. ఏవైనా 6 శాఖల్లో ఏదో ఒక శాఖను ఎంచుకునే అవకాశం కూడా ఇచ్చారని తెలుస్తోంది. అంతేకాదు.. ఐదేళ్ల పదవీకాలంలో రెండున్నరేళ్లు సిద్ధరామయ్యకు, మరో రెండున్నరేళ్లు డీకే శివకుమార్‌కు సీఎం పదవిని ఇవ్వాలని కూడా రాహుల్ అనుకున్నారు. కానీ ఇందుకు సిద్ధ, డీకే ఇద్దరూ ఒప్పుకోలేదని కాంగ్రెస్ వర్గాల సమాచారం.