Shivraj Singh Chouhan: దాని కంటే చావ‌డం మేలు అంటున్న మాజీ సీఎం

Shivraj Singh Chouhan: మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ఉజ్జ‌యినికి చెందిన ఎమ్మెల్యే మోహ‌న్ యాద‌వ్‌ను (mohan yadav) ప్ర‌క‌టించ‌డంతో మాజీ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ కాస్త బాధ‌ప‌డ్డారు. ఆయ‌న సీఎం అవ్వ‌లేద‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన ఆయ‌న మ‌హిళా అభిమానులు శివ‌రాజ్‌ను హ‌త్తుకుని క‌న్నీరుపెట్టుకున్నారు. శివ‌రాజ్ వారిని ఓద‌ర్చారు. అయితే ఎందుక‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎంగా తానే ఉంటాన‌ని BJPని అడ‌గ‌లేదు అని శివ‌రాజ్‌ను అడ‌గ్గా.. అలా అడ‌గడం కంటే చావ‌డం న‌యం అని అన్నారు. త‌న‌ను నియ‌మించనందుకు కాస్త బాధ క‌లిగిన‌ప్ప‌టికీ BJPపై న‌మ్మ‌కం ఉంద‌ని.. మోహ‌న్ యాద‌వ్ త‌న కంటే బాగా ప‌నిచేస్తార‌న్న న‌మ్మకం ఉంద‌ని తెలిపారు.