Shiv Sena: BJP కోసమే మహారాష్ట్రలో BRS
Maharashtra: మహారాష్ట్రలో BRS సెగ శివసేనను (shiv sena) తాకింది. KCR BRS పార్టీని మహారాష్ట్రలో విస్తరించే పనిలో రెండు రోజల పాటు భారీ కాన్వాయ్‌తో వెళ్లి మంగళవారం బహిరంగ సభను ఏర్పాటుచేసారు. ఈ సభను పండరీపూర్‌లో పెట్టారు. దీనిపై శివసేన ఆస్థాన పత్రిక సామ్నా KCRపై తీవ్ర వ్యాఖ్యలతో మండిపడింది. ఒవైసీ తర్వాత హైదరాబాద్ నుంచి మరో బృందాన్ని మహారాష్ట్రకు పంపించారని ఆర్టికల్ రాసింది. మహారాష్ట్ర ఎన్నికల్లో BJPకి లాభం కలిగేలా చేయడం కోసమే BRS టార్గెట్ అంటూ శివసేన (shiv sena) విమర్శలు చేసింది.