Shiv Sena MLA కొడుకు అరాచ‌కం.. CEOని కిడ్నాప్ చేసి..

Mumbai: శివ‌సేన పార్టీకి  (shiv sena)చెందిన ఓ ఎమ్మెల్యే (mla) కొడుకు అరాచ‌కం వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే ప్ర‌కాశ్ సుర్వే (prakash surve) కొడుకు రాజ్ సుర్వే (raj surve).. ఈరోజు ఉద‌యం ముంబైకి చెందిన ఆది శక్తి మ్యూజిక్ కంపెనీ CEOను గ‌న్ పాయింట్‌లో బెదిరించి కిడ్నాప్ చేసాడు. అత‌న్ని త‌న ఇంటికి తీసుకెళ్లి గ‌న్ను పెట్టి బెదిరించి కొన్ని డాక్యుమెంట్ల‌పై సంత‌కం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ కేసులో భాగంగా పోలీసులు ప‌ది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆదిశ‌క్తి కంపెనీ ఓన‌ర్ రాజ్ సుర్వే నుంచి రూ.8 కోట్లు అప్పుగా తీసుకున్నాడ‌ని, కొన్ని సంవ‌త్స‌రాలు అవుతున్నా అప్పు తీర్చ‌నందుకు కిడ్నాప్ చేసాడ‌ని స‌మాచారం అందింద‌ని పోలీసులు తెలిపారు.