Shashi Tharoor: అయితే మేం భార‌త్ అని మార్చుకుంటాం

అపోజిష‌న్ కూట‌మికి ఉన్న ఇండియా (india) పేరు తీసేసి భార‌త్ (bharat) అని మార్చుకుంటామ‌ని అన్నారు సీనియ‌ర్ కాంగ్రెస్ నేత శ‌శి థ‌రూర్ (shashi tharoor). 26 పార్టీల కూట‌మికి ఇండియా అని పేరు పెట్టినందుకే కేంద్రం దేశ పేరును భార‌త్ అని మార్చాల‌ని అనుకుంటోంద‌ని.. అందుకే తాము కూడా కూట‌మికి ఇండియా అని తీసేసి భార‌త్ అని పెట్టుకుంటామ‌ని అన్నారు. త‌మ కూట‌మి భార‌త్‌కు కొత్త అర్థాన్ని కూడా చెప్పారు.

BHARAT అర్థం ఇదేన‌ట‌..!

B- బెట‌ర్‌మెంట్
H- హార్మొనీ
A- అండ్
R- రెస్పాన్సిబుల్
A-అడ్వాన్స్‌మెంట్ ఫ‌ర్
T- టుమారో

అని త‌న‌దైన శైలిలో సెటైర్ వేసారు శ‌శి థ‌రూర్ (shashi tharoor).