అమ్మపై ప్రేమను చాటుకున్న షర్మిలా.. జగన్ సైలెంట్?
Hyderabad: దివంగత నేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (ys rajashekar reddy)భార్య భార్య విజయమ్మ(ys vijayamma)ది ఇవాళ పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆమె కుమార్తె.. వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల(ys sharmila) ట్వీట్ చేశారు. మీ అనంతమైన ప్రేమకు ధన్యవాదాలు.. పుట్టినరోజు శుభాకాంక్షలు(birthday wishes) అమ్మ.. మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ.. షర్మిల తన తల్లిపై ఉన్న ప్రేమని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈ సందర్బంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక విజయమ్మ పుట్టిన రోజు సందర్బంగా వైఎస్‌ఆర్‌టీపీ కార్యకర్తలు, అభిమానులు, పలువురు ప్రముఖులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఇంకా జరుపుకోవాలని సోషల్ మీడియాలో ఆమెకు విషెస్ తెలియజేస్తున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆ సందడి కనిపించడం లేదు. సీఎం జగన్ (cm jagan)కూడా ఇప్పటి వరకు తన తల్లికి సోషల్ మీడియా వేదికగా.. లేదా ప్రకటన రూపంలో కానీ విజయమ్మకు విషెస్ తెలియజేయలేదు. బహుశా ఫోన్లో శుభాకాంక్షలు తెలిపి ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు ఏపీలోని ycp కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు విజయమ్మకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పలేదు. ఇక గత కొంతకాలంగా సీఎం వైఎస్ జగన్‌కు అతని చెల్లి షర్మిలకు మధ్య ఆస్తి వివాదాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే విజయమ్మ కూడా షర్మిలకు తోడుగా హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లోనే ఉంటోంది. పార్టీ స్థాపించిన నాటి నుంచి వైసీపీ గౌరవ అధ్యక్షురాలుగా విజయమ్మ ఉంటూ వస్తుండగా.. గత ఏడాది.. ఆ పదవిని సీఎం జగన్‌కి బదిలీ చేస్తున్నట్లు విజయమ్మ తెలిపారు. తాను కుమార్తె వెంట ఉంటున్నందున పార్టీ కార్యక్రమాలు చూసుకోలేనని ఆమె పేర్కొన్నారు. ఏది ఏమైనా.. ఏపీలో మాత్రం విజయమ్మను వైసీపీ నేతలు పట్టించుకోవడం మానేశారు అన్నది మాత్రం వాస్తవమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.