EXCLUSIVE: బాణం చంద్రబాబుకే గుచ్చుకోబోతోందా?
EXCLUSIVE: వైఎస్ షర్మిళను (ys sharmila) ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చేయించింది తెలుగు దేశం పార్టీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడే (chandrababu naidu) అని ఇప్పటికే YSRCP నేతలు ఆరోపిస్తున్నారు. షర్మిళకు తెలుగు దేశం, జనసేన (janasena) సపోర్ట్ బాగానే ఉంది. అయితే 2019 ఎన్నికల్లో ఈ జగన్ అన్న వదిలిన బాణం 2024 ఎన్నికల్లో చంద్రబాబుకే గురిపెట్టబోతోందని తెలుస్తోంది.
వైఎస్ షర్మిళ పోటీ వల్ల బొక్క చంద్రబాబుకే అని ఎందుకు అనుకోకూడదు? YSRCPకి ఓటు వేయొద్దు అనుకున్న మైనారిటీల ఓట్లు TDPకి పూర్తిగా బదిలీ అవ్వకుండా షర్మిల అడ్డుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ఆ పార్టీకి ఎప్పటినుంచో ఓటు వేయాలి అని ఎదురు చూస్తున్న వారు మాత్రం షర్మిల వైపు చూసే అవకాశం ఉంది. ఎలా చూసుకున్నా చీలే మైనారిటీ ఓట్లతో పోలిస్తే కాంగ్రెస్ అభిమానుల ఓట్లు ఏ మాత్రం ఉంటాయో అంచనా వేసుకుంటే అర్థమవుతుంది నష్టం ఎవరికో.