Sharmila: పోలీస్ చెంప ప‌గ‌ల‌గొట్టిన ష‌ర్మిళ‌

Hyderabad: వైఎస్సార్ తెలంగాణ పార్టీ(ysrtelangana) అధ్య‌క్షురాలు ష‌ర్మిళ(sharmila) పోలీసుల‌పై చెయ్యి చేసుకున్నారు. దాంతో హైద‌రాబాద్‌లోని లోట‌స్ పాండ్‌లో ఉద్రిక్త‌త నెల‌కొంది. ఆమె త‌న నివాసం నుంచి బ‌య‌టికి వ‌స్తుంటే బ‌య‌టే కాప‌లాగా ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఓ ఎస్సైని ప‌ట్టుకుని నువ్వెవ‌రు న‌న్ను ఆప‌డానికి అంటూ అత‌న్ని వెన‌క్కి నెట్టేసారు. మ‌రో మ‌హిళా కానిస్టేబుల్‌ చెంప ఛెళ్లుమ‌నిపించారు.. దాంతో ఎస్సై ఆమెను బండెక్కించి స్టేష‌న్‌కు తీసుకెళ్లండి అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. అయినా ష‌ర్మిళ విన‌కుండా కారులో ఎక్కి వెళ్లేందుకు య‌త్నించారు. పోలీసులు అడ్డుకోవ‌డంతో రోడ్డు మీదే కూర్చుని నిర‌స‌న తెలిపారు. దాంతో ఆమెను అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. మ‌రోప‌క్క ష‌ర్మిళ త‌ల్లి విజ‌య‌మ్మ కూడా అడ్డుకుంటున్నందుకు ఓ మ‌హిళా కానిస్టేబుల్ చెంప‌పై కొట్టింది. వారిద్ద‌రినీ జైల్లో పెట్టాల‌ని, పోలీసుల‌పై ఎలా చేయించేసుకుంటార‌ని BRS నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.