EXCLUSIVE: వామ్మో.. చెల్లి ఇలా తిడుతోందేంటి..!?

EXCLUSIVE: వైఎస్ ష‌ర్మిళ (ys sharmila) కాంగ్రెస్‌లో (congress) చేరారు కాబ‌ట్టి.. అపోజిష‌న్ పార్టీల నేత‌ల‌ను విమ‌ర్శించాల్సి వ‌స్తుంది. తెలంగాణ‌లో అంటే ఎవ్వ‌రూ చుట్టాలు లేరు కాబట్టి ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి (jagan mohan reddy) స్వ‌యాన సొంత అన్న‌య్య కావ‌డంతో ష‌ర్మిళ ఏం మాట్లాడినా కూడా చెవులు చాంతాడంత చేసుకుని వింటున్నారు YSRCP నేత‌లు.

ఏ పార్టీ నేత అయినా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని జ‌గ‌న్ రెడ్డి అని సంబోధించ‌గానే కొంద‌రు పేటీఎం బ్యాచ్ వెంట‌నే వారిపై సోష‌ల్ మీడియా ద్వారా ఎటాక్ చేస్తారు. కానీ ష‌ర్మిళ జ‌గ‌న్ రెడ్డి.. జ‌గన్ రెడ్డి అని ఎన్ని విమ‌ర్శ‌లు చేస్తున్నా ఒక్క‌రూ ఏమీ అన‌లేక‌పోతున్నారు. అంటే ఏమ‌వుతుందో.. అన‌క‌పోతే ఏమ‌వుతుందో అని YSRCP నేత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు.