YS Sharmila: అందరి ఇళ్లల్లో అమ్మలు, చెల్లెళ్లపై కేసులు పెడతారా?
YS Sharmila: APCC చీఫ్ వైఎస్ షర్మిళ తన అన్న జగన్ మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. ఈరోజు జగన్ విజయనగరంలో డయేరియా బాధితులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో షర్మిళ, తల్లి విజయమ్మలపై పెట్టిన కేసుల గురించి ప్రస్తావించారు. నా కుటుంబం మీద అంత ఫోకస్ ఎందుకు? మీ ఇంట్లో గొడవల్లేవా? ఇది ఘర్ ఘర్ కీ కహానీ. నా గొడవలను ఎందుకు భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు అని జగన్ ప్రశ్నించారు. దీనికి షర్మిళ కౌంటర్ ఇచ్చారు. అందరు కుటుంబాల్లో గొడవలుంటాయి. కానీ అందరు కుటుంబాల్లో ఇలా తల్లి, చెల్లిపై కేసులు పెట్టరు కదా. సమస్యలుండడం కామనే.. కానీ ఇట్లా అమ్మనే కోర్టుకు లాగరు కదా జగనన్నా. మాట్లాడితే బెయిల్‌పై ఉన్నా కేసులన్నీ అయ్యాక ఆస్తులు బదిలీ చేస్తా అంటున్నావ్. మరి బెయిల్‌పై ఉన్నప్పుడు అమ్మ పేరిట షేర్లు ఎలా రాసావ్ అని ధీటుగా బదులిచ్చారు.