Telangana Elections: పొత్తుల తిప్పలు..!
ఎన్నికలంటేనే పొత్తులు, గొడవలు, పార్టీ మారడాలు ఉంటాయి (telangana elections). ఇక తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో BJP జనసేన (janasena) పొత్తు పెట్టుకున్నాయి. ఇక కాంగ్రెస్ CPI, CPMలతో పొత్తు పెట్టుకుంది. BJP ఇప్పటికే ఎవరు ఎక్కడ పోటీ చేస్తున్నారు అనేదానిపై అభ్యర్ధులను ప్రకటించేసింది. ఈరోజే మూడో జాబితాను ప్రకటించింది. కానీ జనసేన నుంచి మాత్రం ఇప్పటివరకు అభ్యర్ధుల ప్రకటన రాలేదు. అసలు వారు పోటీలో ఉన్నారా లేరా అనే సందేహాలు కూడా మొదలవుతున్నాయి.
ఇకపోతే.. కాంగ్రెస్, CPI, CPM పార్టీల మధ్య సీట్ షేరింగ్ విషయంలో సహోధ్య కుదరటంలేదు. CPI కోరినట్లు వైరా సీటును కాంగ్రెస్ ఇవ్వలేదు. దాని బదులు మిర్యాలగూడలో పోటీ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఇక CPIకి కావాల్సిన చెన్నూరు, కొత్తగూడెం సీట్లను కాంగ్రెస్ ఇవ్వలేదు. దాంతో వారు అప్‌సెట్ అయ్యారు. చెన్నూరులో CPIకి బలమైన అభ్యర్ధి లేరు. దాంతో కాంగ్రెస్ చెన్నూరు ఇవ్వాలా వద్దా అనే సందేహంలో ఉంది. ఇటీవల వివేక్ రామస్వామి అనే వ్యక్తి BJP నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన కానీ ఆయన కుమారుడు కానీ కాంగ్రెస్ తరఫున చెన్నూరు నుంచి పోటీ చేస్తారని కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
CPI, CPMలు చెరో ఐదు సీట్లు కావాలని అడిగినప్పటికీ.. కాంగ్రెస్ మాత్రం చెరో రెండు కేటాయించేందుకు ఒప్పుకుంది. ఆ నాలుగు సీట్లు కూడా ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఇక CPI, CPMల పట్ల కాంగ్రెస్ ఇలాగే వ్యవహరిస్తే అవి రెండూ ఒంటరిగా బరిలో దిగాలని అనుకుంటున్నాయి. మరోపక్క కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. CPI, CPM పార్టీలతో పొత్తు లేదని.. కావాలంటే గెలిచిన తరువాత చెరో ఎమ్మెల్సీ, చెరో మినిస్ట్రీ ఇస్తామని వెటకారంగా అన్నారు. ఇక దీనితో అసలు కాంగ్రెస్‌కి CPI, CPM పార్టీల మధ్య పొత్తు లేనట్లే అని క్లియర్ అయిపోయింది. అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం. (telangana elections)