Samajwadi Party: భారత్ అసలు హిందూ దేశమే కాదు!
భారత దేశం అసలు హిందూ దేశమే కాదంటూ లోక్ సభ ఎన్నికలు (lok sabha elections) దగ్గరపడుతున్న సమయంలో సమాజ్‌వాది పార్టీ (samajwadi party) నేత స్వామి ప్రసాద్ మౌర్య (swami prasad maurya) వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. RSS చీఫ్ మోహన్ భగవత్ (mohan bhagawat) హిందూ రాష్ట్రం అంటూ చేసిన వ్యాఖ్యలపై మౌర్య మండిపడ్డారు. భారతదేశం ఎప్పుడూ భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న దేశమే కానీ ఎప్పుడూ కూడా హిందూ దేశం కాదని అన్నారు.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మధుకర్ భవన్‌ను ప్రారంభించేందుకు మోహన్ భగవత్ వెళ్లారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. మన దేశం హిందూ దేశం. ఇక్కడ భారత్ అంటే హిందువులు.. హిందువులు అంటేనే భారత్. ఈ విషయం కొంతమందికి అర్థంకావడంలేదు. అని అన్నారు. భగవత్ వ్యాఖ్యలపై మౌర్య స్పందిస్తూ.. భారతదేశంలో అన్ని మతాల వారు ఉన్నారని కేవలం హిందువులు మాత్రమే లేరని తెలిపారు.