Sajjala: పురంధ‌రేశ్వ‌రి TDP ఏజెంట్‌లా వ్య‌వ‌హ‌రిస్తోంది

BJP నేత పురంధ‌రేశ్వ‌రి (purandeshwari) TDP ఏజెంట్‌లా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అన్నారు YSRCP విప్ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy). YCPని ఎదుర్కోలేక TDP, జ‌న‌సేన BJPతో కూట‌మి ఏర్పాటుచేసుకోవాల‌ని అనుకుంటున్నార‌ని, ఇందుకోసం పురంధ‌రేశ్వ‌రిని అడ్డంపెట్టుకుంటున్నార‌ని ఆరోపించారు. రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము నివాసాన్ని రాజ‌కీయాల ప్లాట్‌ఫాంగా మార్చేసార‌ని అన్నారు. నిజంగా అంత ద‌మ్ముంటే TDP ఎందుకు ఏపీలోని 176 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒంట‌రిగా పోటీ చేయ‌లేక‌పోతోంద‌ని, చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) ప‌దే ప‌దే ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారని ప్ర‌శ్నించారు.