Sajjala: బాబుపై రాజకీయ కక్ష ఉంటే ఇంత లేటెందుకు చేస్తాం
TDP అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) అరెస్ట్‌పై స్పందించారు ఏపీ ప్రభుత్వ విప్ సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala). రాజకీయ కక్ష ఉందని సీఎం జగన్ అరెస్ట్ చేయించారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయని.. అసలు రాజకీయ కక్ష ఉంటే 2019లో కేసు నమోదైనప్పుడే జగన్ మ్యాటర స్పీడప్ చేయించేవారు కదా అని అన్నారు. సీఐడి, సీబీఐ, ఈడీ అనేవి రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినట్లు నడుచుకునే సంస్థలు కావని.. వారికి ఆధారాలు ఉంటేనే అరెస్ట్ చేసేందుకు ముందుకు వస్తారని తెలిపారు.
“” చట్టానికి ఎవ్వరూ అతీతులు కారు. ఇప్పుడు మాత్రం చంద్రబాబుని ఉరితీయడానికి ఏమీ తీసుకువెళ్లడంలేదు కదా.? ఆయన్ను తీసుకెళ్లి విచారిస్తారు. ఆయన చెప్పిన వివరాలను బట్టి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు. ఆ తర్వాత కోర్టు ఏం చేస్తుందో దానిని బట్టే తీర్పు ఉంటుంది. ఇందులో మా ప్రభుత్వం చేసింది ఏముంది? “” అని ప్రశ్నించారు సజ్జల (sajjala)