Sajjala: పొత్తులే చెప్తున్నాయ్ YSRCP గెలుపు ఖాయమ‌ని..!

Sajjala: తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party), జ‌న‌సేన‌ల‌తో  (Janasena) భార‌తీయ జ‌న‌తా పార్టీ (Bharatiya Janata Party) క‌లిసి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఎన్నిక‌ల్లో (AP Elections) పోటీ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. నిన్న‌నే ఈ విష‌య‌మై ఢిల్లీ పెద్దలు కూడా క్లారిటీ ఇచ్చేసారు. ఈ నేప‌థ్యంలో ఏపీ ప్ర‌భుత్వ విప్ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) పొత్తుల‌పై స్పందించారు. ఎన్ని పార్టీలు క‌లిసి దూసుకొచ్చినా రానున్న ఎన్నిక‌ల్లో YSRCP గెలుపు త‌థ్య‌మ‌ని.. ఈ విష‌యం పొత్తుల‌తోనే క్లియర్‌గా తెలుస్తోందని అన్నారు. నేత‌లు కూడా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డే (Jagan Mohan Reddy) రెండో ద‌ఫా ముఖ్య‌మంత్రి అవుతార‌ని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అధికారంలోకి రావాల‌ని అనైతికంగా పొత్తుల‌కు పాల్ప‌డే పార్టీల‌తో YSRCPకి పోలిక ఏంటి అని విమ‌ర్శించారు.