EXCLUSIVE: చంద్ర‌బాబు చెప్పాడ‌నే ష‌ర్మిళ ఎంట్రీ

EXCLUSIVE: వైఎస్ ష‌ర్మిళ (ys sharmila) కాంగ్రెస్ పార్టీలో త‌న పార్టీని విలీనం చేయ‌డంపై స్పందించారు ఏపీ ప్ర‌భుత్వ విప్ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy). షర్మిల కాంగ్రెస్ లో చేరడం పై మీ స్పందన ఏమిటి ? YSRCPకి నష్టం కదా ! అని అడ‌గ్గా.. ష‌ర్మిళ‌ను ఏపీలోకి ఎంట్రీ ఇప్పించింది.. కాంగ్రెస్‌లో చేర్పించింది చంద్ర‌బాబు నాయుడేన‌ని.. ఆయ‌న జ‌న‌సేన‌, BJPతో ఎలా మేనేజ్ చేస్తున్నాడో ష‌ర్మిళ‌తో కూడా కుట్ర చేయిస్తున్నాడ‌ని అన్నారు. ఇంత సిగ్గు ఎగ్గు లేని జాతిని ఆంధ్ర జాతి గతంలో చూడలేదు , ఇక పై కూడా చూడలేదేమో ఎన్ని తరాలు అయినా అంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేసారు.