Jagan Sajjala: ప్రమోషన్ ఇవ్వలేను.. ముందు పార్టీని కాపాడు
Jagan Sajjala: సజ్జల రామకృష్ణారెడ్డి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 పిలుస్తుంటారు ఈయన్ని. జగన్ మోహన్ రెడ్డి తర్వాత అంతటి రేంజ్లో ఇంపార్టెన్స్ ఉన్నది ఈయనకే అన్న విషయం అందరికీ తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్ సజ్జలను ప్రభుత్వ విప్‌గా పెట్టుకున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో 11 సీట్లకే పార్టీ పరిమితం కావడంతో జగన్ సజ్జలపై గుర్రుమన్నారన్న టాక్ కూడా నడిచింది. అంతేకాదు.. చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు జగన్‌ను ఎప్పుడు కలిసి మాట్లాడదామన్నా కూడా సజ్జల మధ్యవర్తిగా ఉంటూ అసలు జగన్ దాకా వెళ్లనిచ్చేవాడు కాదని చాలా మంది వాపోయారు.
అయితే.. ఇప్పుడు సజ్జల తనకు ప్రమోషన్ కావాలని జగన్‌ను కోరారట. పార్టీలో చాలా మంది సలహాదారులు ఉన్నారని ఇక తనకు ఆ పదవి అవసరం లేదని అన్నారట. అయితే పార్టీలో చాలా మంది జనరల్ సెక్రటరీలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆ పదవి ఇవ్వలేనని జగన్ అన్నారట. దీనికి సజ్జల సమాధానంగా.. కనీసం ఆ జనరల్ సెక్రటరీలకు చీఫ్‌గా సెక్రటరీ జనరల్ కానీ సీనియర్ జనరల్ సెక్రటరీ అనే పదవి కల్పించి తనకు నలుగురితో చెప్పుకోవడానికి ఉంటుందని వేడుకున్నారట. అయితే ఇందుకు జగన్ ఒప్పుకోలేదు. ప్రస్తుతం పార్టీపై చాలా ఆరోపణలు ఉన్నాయని.. పార్టీని గాడిన పెట్టేందుకు ముందు కృషి చేయాలని అన్నారట. ఆ తర్వాత ప్రమోషన్ గురించి ఆలోచిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.