Sabitha Indrareddy: బుల్డోజర్ వస్తే నా కొడుకు అడ్డుగా నిలబడతాడు
Sabitha Indrareddy: హైడ్రా దారుణంగా పేదల ఇళ్లు పడగొడుతోందని.. ఈసారి ఏ బుల్డోజరు మీదకు వచ్చినా తన కొడుకు అడ్డంగా నిలబడతాడని అన్నారు BRS నేత సబితా ఇంద్రారెడ్డి. తెలంగాణ భవన్‌లో హైడ్రా బాధితులు తమ బాధలు చెప్పుకుంటుంటే.. BRS నేతలు హరీష్ రావు, సబితా కన్నీళ్లుపెట్టుకున్నారు. బాధితులకు అండగా తాము నిలబడతామని వారు మాటిచ్చారు. ఈరోజు కోకాపేటలోని హరీష్ రావు తన నివాసం నుంచి బాధితులతో కలిసి గాంధీ భవన్‌కు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సబిత మీడియాతో మాట్లాడుతూ.. బాధితుల ఇళ్ల పైకి బుల్డోజర్లు వస్తే నా కొడుకు ఆ బుల్డోజర్‌కు అడ్డంగా నిలబడతాడు. ఎవడొస్తాడో రండి అని చెప్పడం వైరల్‌గా మారింది.