AP Assembly లో ర‌చ్చ‌.. మీసం తిప్పిన బాల‌య్య‌..తొడ‌కొట్టిన YCP నేత‌

ఏపీ అసెంబ్లీ (ap assembly) స‌మావేశంలో ర‌చ్చ రచ్చ జ‌రిగింది. YSRCP నేత అంబ‌టి రాంబాబు (ambati rambabu) మాట్లాడుతుంటే.. బాల‌కృష్ణ మీసం తిప్పి హెచ్చ‌రించడంతో ఆయ‌న మ‌రింత రెచ్చిపోయారు. దమ్ముంటే రా అంటూ అంబటి సవాల్ విసిరారు. TDP సభ్యులతో కలిసి పోడియం ఎక్కి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆందోళన చేసారు. మీసాలు తిప్పడాలు సినిమాల్లో చూపించుకోవాలంటూ బాలకృష్ణకు అంబటి కౌంటర్ వేసారు. చంద్రబాబు నాయుడు అరెస్టుపై (chandrababu naidu arrest) అసెంబ్లీలో పోడియం TDP సభ్యులు నిర‌సన వ్య‌క్తం చేసారు. బాలకృష్ణను చూస్తూ తొడగొట్టి రా బయట చూసుకుందాం అని YSRCP శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అనడంతో మ‌రింత పేట్రేగిపోయారు.