RS Praveen Kumar: నాటు నాటు తెలంగాణ జాతీయ గీతం కాదు

RS Praveen Kumar says naatu naatu is not the song of telangana

RS Praveen Kumar:  జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎంఎం కీర‌వాణి చేత జ‌య జ‌య‌హే తెలంగాణ అనే పాట‌ను రాయించాల‌ని అది రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తెలంగాణ అమ‌ర‌వీరుల‌కు అంకితం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీనిపై అభ్యంత‌రం వ్యక్తం చేసారు భార‌త రాష్ట్ర స‌మితి నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. తెలంగాణ పాట‌ను తెలంగాణ‌కు చెందిన సంగీత ద‌ర్శ‌కుల చేత కాకుండా ఆంధ్ర‌ప్రదేశ్‌కు చెందిన ఎంఎం కీర‌వాణి చేత ఎలా చేయిస్తారు అని ప్ర‌శ్నించారు.

ఆయ‌న పాట‌ను కంపోజ్ చేయ‌డానికి తెలంగాణ గీతం ఏమ‌న్నా నాటు నాటు పాట అనుకుంటున్నారా అని మండిప‌డ్డారు. జ‌య జ‌య‌హే తెలంగాణ పాట‌ను రాసింది తెలంగాణ‌కు చెందిన ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత అందెశ్రీ. కానీ ఆ లిరిక్స్‌కి ట్యూన్ క‌ట్టాల‌ని రేవంత్ రెడ్డి కీర‌వాణిని సంప్ర‌దించ‌డం ప‌ట్ల చాలా మంది తెలంగాణ నేత‌లు, ప్ర‌జ‌లు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు.