RRR: మీరు ఓడిపోయిన‌ప్పుడు జ‌గ‌న్ అస‌లు ప‌ట్టించుకోలేదు.. మ‌రి మీకేంటి బాధ‌?

RRR slams ktr and kcr

RRR: ఉండి ఎమ్మెల్యే ర‌ఘురామ కృష్ణంరాజు ఇంకా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేరును జ‌పిస్తూనే ఉన్నారు. ఒక‌ప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఉన్న ఆయ‌న త‌న‌కు జ‌గన్ వ‌ల్ల ప్రాణ హాని ఉందంటూ బ‌య‌టికి వ‌చ్చేసారు. ఆ త‌ర్వాత తెలుగు దేశం పార్టీకి, చంద్ర‌బాబు నాయుడుకు మ‌ద్ద‌తు ఇస్తూ మొత్తానికి తెలుగు దేశం పార్టీ త‌ర‌ఫు నుంచి ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.

అయితే ర‌ఘురామ ఎప్పుడు జ‌గ‌న్ గురించి మాట్లాడినా మా ముఖ్యమంత్రి అంటుంటారు. ఇప్పుడు ఆయ‌న ఓడిపోయిన త‌ర్వాత కూడా అల‌వాటులో పొర‌పాటుగా మా ముఖ్య‌మంత్రి అనేసి నాలుక క‌ర్చుకున్నారు. భార‌త రాష్ట్ర స‌మితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… జ‌గ‌న్ ఓట‌మి గురించి ఆయ‌న ఎలా ఓడిపోయారో అర్థంకావ‌డంలేదు అని చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల ర‌ఘురామ‌ స్పందించారు.

“” కేటీఆర్ గారూ ఎలా ఓడిపోయానా అని మా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు.. సారీ సారీ మా అప్ప‌టి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు కూడా అర్థంకావ‌డంలేదు. తెలంగాణ‌లో మీ ప‌రిస్థితి కూడా అలాగే ఉంది. మీరు మిత్ర ధ‌ర్మం పాటించారు. కానీ జ‌గ‌న్ మీరు ఓడిపోయిన‌ప్పుడు అలాగెలా ఓడిపోయారు అని కనీసం ప‌ట్టించుకోలేదు. మ‌రి జ‌గన్ ఓడిపోతే మీకెందుకు స‌ర్ అంత బాధ “” అని ప్ర‌శ్నించారు.