Roja: TDP BJPని విలీనం చేయ‌డానికి పురంధేశ్వ‌రి ప్ర‌య‌త్నాలు

తెలుగు దేశం పార్టీని (TDP) BJPలో విలీనం చేయ‌డానికి పురంధేశ్వ‌రి (purandeswari) ప్ర‌యత్నిస్తోందని అన్నారు YSRCP మంత్రి రోజా (roja). ఇటీవ‌ల నారా లోకేష్‌తో (nara lokesh) క‌లిసి పురంధేశ్వ‌రి హోం మంత్రి అమిత్ షాను (amit shah) క‌లిసిన సంగ‌తి తెలిసిందే. BJPలో ఉంటూ TDP నేత‌లకు స‌పోర్ట్ చేయ‌డం ఏంటి అని రోజా ప్ర‌శ్నించారు. అస‌లు లోకేష్‌ని అమిత్ షా ద‌గ్గ‌రికి తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం ఆమెకు ఏంటి అని అన్నారు. ఎంత బంధుత్వం ఉన్నా పురంధేశ్వ‌రి TDPలో లేర‌ని BJPలో ఉన్న‌ప్పుడు హైక‌మాండ్ చెప్పిన‌ట్లు న‌డుచుకోవాల‌ని స‌ల‌హా ఇచ్చారు.