Roja: చంద్రబాబు అరెస్ట్ అయినందుకు NTR సంతోషిస్తారు
చంద్రబాబు నాయుడు (chandrababu naidu) అరెస్ట్ అయినందుకు దివంగత నేత నందమూరి తారక రామారావు (ntr) ఎంతో సంతోషిస్తారని ఇంతకాలం తన కుటుంబం చేయలేనిది.. నేడు ఏపీ ప్రభుత్వం చేసి చూపించినందుకు జగన్‌ను ఆశీర్వదిస్తారని రోజా (roja) అన్నారు. కన్నతండ్రిని చంపేస్తే భర్తను ఏమీ అనలేని భువనేశ్వరి ఈరోజు మీడియా ముందుకు వచ్చి తన భర్తను గెలిపించాలని అంటే ప్రజలు ఎవ్వరూ నమ్మరని అన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే ఆయన్ను పరామర్శించడానికి వెళ్లాల్సిన అవసరం పవన్ కళ్యాణ్‌కి ఏముందని ప్రశ్నించారు. రాకూడని సమయంలో ఏపీలోకి ప్రవేశించి రోడ్డుపై పడుకుని ఓవరాక్షన్ చేయడం వెనుక అర్థమేంటి అన్నారు. పవన్ కళ్యాణ్ ఓవరాక్షన్ చూసి నారా లోకేష్‌కు కూడా కొడుకు తనా లేక పవనా అని డౌట్ వచ్చి ఉంటుందని కామెంట్స్ చేసారు. పవన్ ప్యాకేజీ కోసమే కాకుండా తన ఆస్తిని కూడా దోచుకుంటాడేమోనని లోకేష్‌కి అనుమానం వచ్చి ఉంటుందని షాకింగ్ వ్యాఖ్యలు చేసారు. (roja)
“” అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఆయనకు సానుభూతి వస్తుందని అనుకోవడం పొరపాటు. ఆయనకు సానుభూతి వస్తుందన్న భయం మాకు లేనేలేదు. అలాంటి భయమే ఉంటే 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మీద కేసు పెట్టి విచారణ చేయించి ఆధారాలతో పట్టించాలని అనుకోం కదా. చంద్రబాబు మీద అలిపిరిలో ఎటాక్ జరిగినప్పుడు కూడా ఆయన ఇదే సానుభూతితో ముందస్తు ఎన్నికలకు పోయారు. కానీ ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత ఓటుకు నోటు కేసులో ఎలా మేనేజ్ చేసి బయటపడ్డారో అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో జగన్ ఉన్నప్పుడు చంద్రబాబు గెలిచాడు అంటే అందుకు కారణం అప్పట్లో జగన్‌ది ఇంకా చిన్నవయసు కావడం. రాజకీయ అవగాహన లేనివారికి ఓట్లు వేయకూడదని ప్రజలు అనుకున్నారు కాబట్టి వేయలేదు. అంతేకానీ జగన్‌పై కోపంతోనో చంద్రబాబుపై ఇష్టంతోనో కాదు. అప్పట్లో ఇచ్చిన మేనిఫెస్టోని సొంత వెబ్‌సైట్ నుంచి డిలీట్ చేసిన వ్యక్తికి మళ్లీ అధికారం కట్టబెడితే రాష్ట్రాన్ని దోచేస్తాడని ప్రజలకు క్లియర్‌గా అర్థమైంది కాబట్టే జగన్‌ను గెలిపించుకున్నారు. అసలు మా ప్రభుత్వంపై లోకేష్, చంద్రబాబు, పవన్ ఆరోపణలు చేయాల్సిన అవసరం ఏముంది? మా జగన్ అన్న చెప్పినట్లు ఇచ్చిన హామీలన్నీ 98% నిలబెట్టుకున్నాడు. అలాంటప్పుడు ఇక ఆరోపణలు వ్యతిరేకత ఎందుకు? “” అని అభిప్రాయపడ్డారు రోజా (roja)