Roja: అడ్డంగా దొరికితే జైలుకి కాకుండా జైలర్ సినిమాకి పంపాలా?
అక్రమ కేసుల్లో అడ్డంగా దొరికితే జైలుకి కాకుండా జైలర్ సినిమాకు పంపించాలా అంటూ వెటకారంగా మాట్లాడారు YSRCP నేత రోజా (roja). నిన్న జనసేనాని పవన్ కళ్యాణ్ (pawan kalyan) ప్రెస్ మీట్‌పై రోజా స్పందించారు.
“” నారా లోకేష్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, భువనేశ్వరిలతో పని అవ్వడంలేదని బ్రహ్మాస్త్రంలాగా బ్రాహ్మణిని ఉపయోగించారు. నిన్న ఆమె కొవ్వొత్తి పట్టుకుని రిమాండ్ రిపోర్ట్‌లో ఏమీ లేదని తన కొడుకు దేవాన్ష్‌కి కూడా అర్థమవుతుందని అన్నారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి దేవాన్ష్‌కి రిమాండ్ రిపోర్ట్ చూపించకండి. తన తాత ఎంత పెద్ద నేరగాడో చూసి తట్టుకోలేడు. ఇక పవన్ కళ్యాణ్ TDP జనసేన పొత్తు హిట్ అంటున్నాడు. పొత్తు పెట్టుకున్న రెండు రోజుల్లోనే ఎన్నికలు వచ్చేసి గెలిచేసాం అనుకుంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ దేంట్లో సక్సెస్ అయ్యాడని జగన్ అన్న బతుకు గురించి మాట్లాడుతున్నాడు. ఒక కొడుకుగా, భర్తగా, మనిషిగా ఏ విషయంలోనూ పవన్ సక్సెస్ అవ్వలేదు. కన్నతల్లిని తిట్టించిన నారా లోకేష్‌ను ఏమీ అనకుండా పోయి వారితోపే పొత్తు పెట్టుకున్న నువ్వెంత నీ బతుకెంత. ఢిల్లీకి వెళ్లి అమిత్ షాతో మాట్లాడతానన్నావ్. ఏం మాట్లాడతావ్? గతంలో చంద్రబాబు నాయుడు మోదీ గురించి అమిత్ షా గురించి నోటికొచ్చినట్లు మాట్లాడాడు సర్.. ఇప్పుడు ఆయనతోనే పొత్తు పెట్టుకుందామా అని అడుగుతాడా? ఇవన్నీ వింటే అమిత్ షా గడ్డి పెట్టి మెడ పట్టుకుని బయటికి గెంటుతారు “” అని తెలిపారు రోజా (roja)