Roja: రేపు జ‌గ‌న‌న్నే సీఎం

roja says ysrcp is going to win tomorrow

Roja: ఎవ‌రు ఎన్ని స‌ర్వేలు చేయించినా ఎన్ని ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు వ్య‌తిరేకంగా వ‌చ్చినా రేపు కౌంటింగ్ జ‌రిగాక రెండోసారి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా గెల‌వ‌బోతున్నార‌ని అన్నారు న‌గిరి ఎమ్మెల్యే రోజా. రేపు ఎన్నిక‌ల కౌంటింగ్ జ‌రగ‌నున్న నేప‌థ్యంలో రోజా తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడారు. “” ఎగ్జిట్ పోల్స్‌లో నేను గెల‌వ‌ను అని అన్నారు. ఎవ‌రికి వారు న‌చ్చిన‌ట్లు ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు ఇచ్చుకున్నారు. ఎవ‌రు ఎన్ని చెప్పినా రేపు కౌంటింగ్ త‌ర్వాత జ‌గ‌న‌న్నే రెండోసారి ముఖ్య‌మంత్రి కాబోతున్నారు “” అన్నారు.