Roja: చంద్ర‌బాబుతో ఉన్నందుకు ప‌వ‌నే భ‌య‌ప‌డాలి

జ‌న‌సేన (janasena), తెలుగు దేశం పార్టీలు (tdp) పొత్తుపెట్టుకున్నందుకు త‌మ‌కు భ‌య‌మేమీ లేద‌ని.. చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) ప‌క్షాన చేరినందుకు ప‌వ‌న్ క‌ళ్యాణే (pawan kalyan) భ‌య‌ప‌డాల‌ని అన్నారు రోజా (roja).

“” ప‌వ‌న్ నాకు తిక్కుంది దానికో లెక్కుంది అంటుంటాడు. ఆయ‌న లెక్క ప్యాకేజీ అని అంద‌రికీ తెలుసు. ప‌వ‌న్ తెలుగు దేశంతో ఉన్నాడు.. అత‌ను చంద్ర‌బాబుకి దత్త‌పుత్రుడు అని నేను జ‌గ‌న్ అన్న చెప్తూనే ఉన్నాం. కాబ‌ట్టి అత‌ను TDPతో పొత్తు పెట్టుకోవ‌డం మాకేం షాకింగ్‌గాలేదు. భ‌యం అస్స‌లు లేదు. చంద్ర‌బాబుతో ఉన్నందుకు ప‌వ‌నే భ‌య‌ప‌డాలి. ఎందుకంటే.. చంద్ర‌బాబు స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కాంలో ప‌వ‌న్ హ‌స్తం ఉంటే అత‌నికి కూడా జైలు త‌ప్ప‌ద‌ని తెలుసు. మొన్న‌టివ‌ర‌కు BJPతో ఉన్న ప‌వ‌న్ ఇప్పుడు TDP అంటున్నాడు. నాకు తెలిసి BJP వీరితో క‌లిసి ఎన్నిక‌ల్లో పోటీచేయాల‌ని అనుకోదు.

ఎందుకంటే.. పెళ్లాన్ని చూసుకోలేనివాడు దేశాన్ని ఏం చూసుకుంటాడని ఒక‌ప్పుడు చంద్ర‌బాబు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని విమ‌ర్శించాడు. ఓసారి అమిత్ షా ఏపీకి వస్తే ఆయ‌న‌పై రాళ్లు రువ్వించారు. ఇవ‌న్నీ వారికి గుర్తుంటాయి. కాబ‌ట్టి BJP వీరితో కల‌వ‌దు. ఒక‌వేళ క‌లిసినా మాకు జ‌రిగే న‌ష్టం ఏమీ లేదు. ఎందుకంటే జ‌గ‌న్ అన్న ప్ర‌జ‌ల‌ను దేవుడిని న‌మ్ముకున్నాడు. ఈ ప్ర‌పంచంలో ఏ రాజ‌కీయ నాయ‌కుడు కూడా నా వల్ల మీకు మీ కుటుంబానికి మంచి జ‌రిగితేనే ఓటు వేసి గెలిపించండి అని అడ‌గ‌డు. నారా లోకేష్ ఢిల్లీ వెళ్తున్నార‌ని తెలిసింది. అక్క‌డే ఈడీ, సీబీఐ కూడా ఉన్నాయి. వారు అస‌లు త‌ప్పు చేయ‌క‌పోతే అదే ఈడీ, సీబీఐ ద‌గ్గ‌రికి వెళ్లి మేం త‌ప్పు చేయ‌లేదు మీరు ద‌ర్యాప్తు చేయండి అని లెట‌ర్ ఇవ్వ‌మ‌నండి “” అని తెలిపారు రోజా. (roja)