Roja: మీ బావ తప్పు చేసారని ఒప్పుకుంటున్నారా బాలయ్య?
TDP నేతలు దమ్ముంటే ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు (chandrababu naidu) చేసిన స్కాంలపై చర్చకు రావాలని సవాల్ విసిరారు YSRCP నేత రోజా (roja). ఏపీ అసెంబ్లీలో హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ (balakrishna) వికృత చేష్టలు చూస్తుంటే.. బావ తప్పుచేసారని ఆయన ఒప్పుకున్నట్లే తెలుస్తోందని అన్నారు.
“” స్కాంల గురించి అసెంబ్లీలో చర్చించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. TDP సిద్ధంగా ఉందా? సినిమాలో డైరెక్టర్ స్క్రిప్ట్ రాసిస్తే చదివినట్లు అవ్వదు. నిజంగా చంద్రబాబు తప్పుచేయకపోతే నా బావ తప్పు చేయలేదు.. కావాలంటే ఈడీ, సీబీఐ కూడా విచారణకు రమ్మనండి అని బాలయ్య చెప్పగలరా? అసెంబ్లీలో మేం స్కాంల గురించి మాట్లాడితే వాకౌట్ చేస్తారు. ఇంకోసారి మా పార్టీ వారిపై కానీ జగన్ గురించి కానీ తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదు “” అని తెలిపారు రోజా.