Roja: బండారు వ్యాఖ్యలు.. రోజా కంటతడి
మంత్రి రోజా (roja) కంటతడి పెట్టుకున్నారు. TDP మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి (bandaru satyanarayana murthy) మూడు రోజుల క్రితం రోజా బ్లూ ఫిలింస్ తమ దగ్గర ఉన్నాయని అసభ్యకరంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. ఆయనపై మహిళా సంఘం కేసు పెట్టడంతో ఈరోజు ఏపీ పోలీసులు అరెస్ట్ చేసారు.
“” నేను తప్పుడు మనిషిని అయితే పదేళ్ల క్రితం TDPలోకి నన్ను చంద్రబాబు నాయుడు ఎందుకు ఆహ్వానించారు. పార్టీలో ఉన్నప్పుడు నేను గోల్డెన్ లెగ్ అన్నారు. నాకు పార్టీ విధానాలు నచ్చక నేను పార్టీ నుంచి బయటికి వచ్చేస్తే నన్ను ఐరన్ లెగ్ అంటున్నారు. నేను బ్లూ ఫిలింస్‌లో చేసాను అంటున్నారు. మరి మీ దగ్గర ఆ వీడియోలు ఉంటే మీడియా ముందుకు ఎందుకు బయటపెట్టరు? నా మీద ప్రేమతో దాచుకున్నారా? మీ పార్టీ కోసం ప్రచారం చేసిన సినిమా ఆర్టిస్ట్‌ల గురించి బ్లూ ఫిలింస్ చేసేవారనే మాట్లాడుతున్నారా.
NTR TDP పార్టీ పెట్టారు కాబట్టే అలనాటి సీనియర్ నటీమణులు మీ పార్టీలో చేరారు. కానీ మీరు మహిళల్ని ఆట వస్తువుగా చీప్‌గా చూస్తారు కాబట్టే వారు బయటికి వెళ్లిపోతున్నారు. ఏమన్నా అంటే NTR మీద ప్రేమతో ఆయన కుటుంబీకులు సమస్యలు ఎదుర్కొంటుంటే తట్టుకోలేక రోజా గురించి అలా అన్నాను అని బండారు అంటున్నారు. మరి అదే NTRపై చెప్పులేసి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు చెప్పులు ఎందుకు మోస్తున్నావు బండారు? అసలు నువ్వెవడు నా క్యారెక్టర్ గురించి మాట్లాడాటానికి.
ఈరోజు లోకేష్ ఇతరులను ఎంకరేజ్ చేసి నన్ను తిట్టించాలనుకున్నాడు. అయ్యన్నపాత్రుడితో నన్ను తిట్టించాడు లోకేష్. ఇప్పుడు అదే అయ్యన్నపాత్రుడు బ్రాహ్మణిని అదెవరు అని మాట్లాడిన మాట మర్చిపోయావా లోకేష్. బాలకృష్ణ కూతురివైతే అబద్ధాలు చెప్పచ్చా? అబద్ధాలు ఆడేవారిని ఏమన్నా అంటే మా క్యారెక్టర్ల గురించి మాట్లాడుతున్నారు. బండారు ఇలా నీచంగా మాట్లాడాడని ఆయన భార్యకు తెలిసిన రోజే చెప్పుతో కొట్టి ఉంటే బాగుండేది. ఈరోజు బండారుని అరెస్ట్ చేసారని దీనిని ఇక్కడితో వదిలెయ్యను. కచ్చితంగా అతనిపై పరువు నష్టం దావా వేస్తాను. నా నోరు ఎంత నొక్కాలని చూసినా మీరు ఏమీ చేయలేరు. నా ప్రాణం ఉన్నంత వరకు నేను జగన్ అన్నకే సపోర్ట్ చేస్తాను “” అంటూ కంటతడి పెట్టుకున్నారు రోజా. (roja)