Haryana Election Results: ఓట‌మి వేళ బామ్మ‌ర్ది ఓదార్పు

robert vadra consoles rahul gandhi amid losing in haryana elections

Haryana Election Results: హ‌ర్యాణా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు మామూలు షాక్ త‌గ‌ల్లేదు. ఈరోజు ఉద‌యం కౌంటింగ్ మొద‌ల‌వగానే ముంద‌స్తు ట్రెండ్స్ అన్నీ కాంగ్రెస్‌దే విజ‌యం అన్న‌ట్లు చూపించాయి. దాంతో హ‌ర్యాణాలోని కాంగ్రెస్ కార్యాల‌యాల్లో డ‌ప్పు కొట్టే వాళ్ల‌ను పిలిపించి మ‌రీ సంద‌డి చేసారు. తీరా చూస్తే అక్క‌డ ఉన్న‌ట్టుండి కాంగ్రెస్ నెమ్మ‌దిగా ప‌డిపోతూ వ‌చ్చింది. భార‌తీయ జనతా పార్టీ ఆధిక్యంతో దూసుకెళ్తుండ‌డంతో షాక్‌కు గురైంది. దాంతో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జైరాం ర‌మేష్ వెంట‌నే ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు లేఖ రాసారు. అధిక సీట్ల‌లో దూసుకెళ్తున్న కాంగ్రెస్ ఉన్న‌ట్టుండి త‌క్కువ సీట్ల‌కు ఎలా ప‌డిపోయింది అంటూ ఈవీఎంల ట్యాంపరింగ్ అంశాన్ని లేవనెత్తారు. ఈ నేప‌థ్యంలో ప్రియాంకా గాంధీ భ‌ర్త రాబ‌ర్ట్ వాద్రా చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

ప్ర‌జల‌కు ఏం కావాలో అర్థం చేసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేయండి. భార‌త్ గురించి విస్తృత స్థాయిలో ఆలోచించ‌డం మొద‌లుపెట్టండి అని పోస్ట్‌లో పేర్కొన్నారు. దాంతో ఫ‌లితాల వేళ రాహుల్‌కి బామ్మ‌ర్ది ఆయింట్‌మెంట్ పూస్తున్నారు అంటూ భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌లు వెక్కిరింపు కామెంట్స్ పెడుతున్నారు.