VH: జస్ట్ మిస్.. పెద్దాయనకే కుచ్చు టోపీ..!
కొందరు కేటుగాళ్లు ఏకంగా కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హన్మంతరావుకే (vh) కుచ్చుటోపీ పెట్టబోయారు. హరిరామ జోగయ్య పేరిట vh హన్మంతరావును బోల్తా కొట్టించే యత్నం చేసారు. ఓ నంబర్ నుంచి ఫోన్ చేసి ఆపదలో ఉన్నాను అర్జెంటుగా డబ్బులు పంపాలని హనుమంతరావును కోరారు. తనకు వచ్చిన నెంబర్ హరిరామ జోగయ్యది కాకపోవడంతో అనుమానం వచ్చి ఓ వ్యక్తిని ఆయన ఇంటికి పంపి విచారణ చేయించారు. ఫేక్ అని తేలడంతో పశ్చిమ గోదావరి ఎస్పీకి ఫిర్యాదు చేసారు. ఈ నెంబర్ ఖమ్మం నుంచి వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. దాంతో ఖమ్మం ఎస్పీ, సైబరాబాద్ పోలీసులకు VH ఫిర్యాదు చేసారు.