జ‌గ‌న్‌కు షాక్‌.. BJPలోకి రోజా?

rk roja to join bjp

 

తెలుగు దేశం పార్టీలో ఉన్న‌ప్పుడు త‌న‌పై చంద్ర‌బాబు నాయుడు కుట్ర చేసాడంటూ వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరింది రోజా. 2019 ఎన్నిక‌ల్లో న‌గిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన‌ప్ప‌టి నుంచి చంద్ర‌బాబు నాయుడిని తిట్ట‌ని రోజంటూ లేదు. ప్ర‌తి రోజూ ఓ ప్రెస్‌మీట్ పెట్టి నోటికొచ్చిన‌ట్లు మాట్లాడేది. ఇలాగే ఐదేళ్లు కొన‌సాగింది. ఇక ఎప్పుడైతే చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్ అయ్యారో ఆ రోజున ఆమె రాకెట్లు కాల్చి మ‌రీ సెల‌బ్రేష‌న్స్ చేసుకుంది. చంద్ర‌బాబుతో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ పొత్తు పెట్టుకున్నాడ‌ని.. ఆయ‌న్ను కూడా నానా మాట‌లు అంది.

క‌ట్ చేస్తే.. మొన్న జ‌రిగిన ఎన్నిక‌ల్లో దారుణంగా ఓడిపోయింది. అధికారంలో ఉన్నంత వ‌ర‌కు తెగ ప్రెస్‌మీట్లు పెట్టి తిట్టిన రోజా.. ఓడిపోయాక ఒక సోష‌ల్ మీడియా పోస్ట్ పెట్టిందే త‌ప్ప ఒక్క‌సారి కూడా మీడియా ముందుకు వ‌చ్చే ధైర్యం చేయ‌లేదు. అయితే ఇప్పుడు ఆమె ప్ర‌యాణం ఎటు? మ‌ళ్లీ జ‌బ‌ర్ద‌స్త్ జ‌డ్జిగా వెళ్తారా? లేక ఇంట్లోనే ఉండిపోతారా? అనే అంశం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే ఎన్నిక‌ల‌కు ముందే రోజా ద‌గ్గ‌ర ప్లాన్ బి ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఎన్నిక‌ల్లో తాను ఓడిపోతాన‌ని ముందే తెలీడంతో భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం.

ఒక‌వేళ భార‌తీయ జ‌న‌తా పార్టీలోకి రానిచ్చే అవ‌కాశం లేక‌పోతే.. త‌మిళ‌నాడులోని డీఎంకే పార్టీలో చేరే అవ‌కాశం ఉన్న‌ట్లు కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. ఆరు నెల‌ల క్రితం రోజా భ‌ర్త సెల్వ‌మ‌ణి త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్‌ను కూడా క‌లిసారు.