RK Roja: విజయ్ పార్టీలోకి రోజా.. 2025 ఎన్నికల్లో పోటీ!
RK Roja: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్‌గా పేరుగాంచిన ఆర్కే రోజా తెలుగు రాజకీయాలకు స్వస్తి పలకనున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఘోర పరాజయాన్ని అందుకున్నారు. సాధారణంగా ఒక పార్టీ నేతకు మరో పార్టీ నేతతో విభేదాలు ఉంటాయి. కానీ రోజాకు మాత్రం అటు తెలుగు దేశం పార్టీతో పాటు సొంత పార్టీ నేతలతో కూడా విభేదాలు ఉన్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు నగరి మున్సిపల్ ఛైర్‌పర్సన్ కేఎల్ శాంతి, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, పుత్తూరు మున్సిపల్ సభ్యుడు ఎలుమలై వారి కార్యకర్తలు రోజాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు.
దాంతో తనకు తెలుగు రాజకీయాల పట్ల విరక్తి కలిగి ఇక రోజా తన మెట్టినంట రాజకీయాల్లో అడుగుపెట్టాలని చూస్తున్నారట. తమిళనాడుకు చెందిన నటుడు విజయ్ స్థాపించిన తమిళట్ర వెట్రి కళగమ్ (TVK) పార్టీలోకి రోజా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 2025లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రోజా తిరుపతి తమిళనాడు బోర్డర్ ప్రాంతంలో పోటీ చేయాలని అనుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మొన్న ఎన్నికల్లో ఓడిపోయాక మంచి చేసి ఓడిపోయాం కాబట్టి తలెత్తుని సగర్వంగా ప్రజల గొంతుకై నిలబడదాం అని వ్యాఖ్యానించిన రోజా.. ఆ తర్వాత నుంచి అసలు కనిపించకుండాపోయారు. తన కుమార్తెతో సిడ్నీలో ఎంజాయ్ చేస్తున్నారు. పార్టీకి సంబంధించి ఎలాంటి అంశాలపైనా రోజా మాట్లాడకపోవడంతో ఆమె తమిళనాడు పాలిటిక్స్‌కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టే మౌనం వహిస్తున్నట్లు తెలుస్తోంది.