RK Roja: 40 శాతం ఓటింగ్‌తో రేవంత్ సీఎం అయ్యాడు.. మరి జగన్ ఎందుకు కాలేదు?
RK Roja: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓడిపోయాక తొలిసారి వైఎస్సార్ కాంగ్రెస్ నేత ఆర్కే రోజా మీడియా ముందుకు వచ్చారు. తన ఓటమి గురించి నిన్న పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత రోజా విలేకర్లతో మాట్లాడారు. తెలుగు దేశం పార్టీ ఎలా గెలిచిందో చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడని.. 40 శాతం ఓటింగ్‌తో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు.. 40 శాతం ఓటింగ్‌తో నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయినప్పుడు.. మరి అదే 40 శాతం ఓటింగ్‌తో జగన్ ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోయారు అని ప్రశ్నించారు. గుమ్మడికాయ దొంగలు ఎవరు అంటే తెలుగు దేశం వారు భుజాలు తడుముకోవడం ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారని అన్నారు.