RK Roja: జగన్ వల్లే విజయవాడ పూర్తిగా మునగలేదు
RK Roja: తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వల్లే విజయవాడ జిల్లా మొత్తం ముంపుకు గురికాలేదని అన్నారు మాజీ మంత్రి రోజా. విజయవాడ వరదలపై ఆమె వీడియో పోస్ట్ చేసారు. ఆగస్ట్ 28న తారీఖునే వాతావరణ శాఖ వర్షాలు, వరదలపై హెచ్చరికలు జారీ చేసినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కనీసం ఒక గంట ముందు హెచ్చరించినా ఈరోజు 4 లక్షల మంది ప్రజలు నీటి మధ్య ఉండేవారు కాదని అన్నారు.
వారికి ఆహారం, పాలు వంటి కనీస వసతులు కూడా అందడం లేదని.. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అని తెలిపారు. రెవెన్యూ శాఖ మంత్రి పరిస్థితిని సమీక్షించడం మానేసి హాలిడే ఎంజాయ్ చేస్తున్నాడని.. ఇతర మంత్రులు కూడా అసలు ప్రజలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈరోజు విజయవాడలో ఒక వైపు ప్రాంతమంతా సేఫ్‌గా ఉంది అంటే అందుకు కారణం జగన్ కట్టించిన వాల్ అని అన్నారు. జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఉపయోగించుకోవాలని సూచించారు.